గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించి అధికారులను అప్రమత్తం చేసిన నాయకులు
రిపోర్టర్: Abdul Azeem
స్థలం: ఆమనగల్లు
రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని సూర సముద్రం వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను మున్సిపాలిటీ చైర్మన్ పత్య నాయక్, కమిషనర్ రాఘవేందర్ రెడ్డి, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై సంతోష్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా పూర్తి చేయాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ముక్తాల వెంకటయ్య, నాగిళ్ల జగన్, అనుష శ్రీశైలం, ఎర్రవోలు మహేష్, ధోలీ మల్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు.