నకిలీ వార్తలతో తీవ్ర నష్టం: ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ పోలీసుల హెచ్చరిక

రిపోర్టర్: రాము స్థలం: Telangana

నకిలీ వార్తలు సమాజంలో తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలంగాణ పోలీసులు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. సోషల్ మీడియాలో ఎలాంటి సమాచారం కనిపించినా వెంటనే నమ్మకుండా, క్షుణ్ణంగా పరిశీలించి, అసలు నిజాలు ఏమిటో నిర్ధారించుకున్న తర్వాతే ఇతరులకు షేర్ చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అవాస్తవ ప్రచారాలను నమ్మి మోసపోవద్దని, సైబర్ భద్రతా నిబంధనలను విధిగా పాటించాలని సూచిస్తూ తెలంగాణ పోలీసులు ప్రత్యేకంగా ట్వీట్ చేశారు.