లండన్లో భారీగా ఫోన్ల చోరీల గుట్టురట్టు చేసిన పోలీసులు
రిపోర్టర్: రమేష్
స్థలం: World
లండన్ నగరంలో జరుగుతున్న భారీ ఎత్తున మొబైల్ ఫోన్ల చోరీల ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. క్రిస్మస్ ఈవ్ సందర్భంగా హీత్రూ విమానాశ్రయం సమీపంలోని ఒక గిడ్డంగిపై దాడి చేసిన పోలీసులు, బ్యాటరీల డబ్బాల్లో దాచిపెట్టిన వేలాది ఐఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. చైనాకు అక్రమంగా ఫోన్లను రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను గుర్తించి, సుమారు రెండు వేల ఫోన్లతో పాటు భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు.