వినాయక చవితి పర్వదినాన ప్రజలకు కౌన్సిలర్ శుభాకాంక్షలు

రిపోర్టర్: Chinukani Yuvaraju స్థలం: చౌటుప్పల్

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పురపాలక సంఘం పరిధిలోని 1వ వార్డు కౌన్సిలర్ కోసనం రాకేష్ రెడ్డి పట్టణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టఐశ్వర్యాలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆయన మనసారా ఆకాంక్షించారు. ఈ పవిత్రమైన వినాయక ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో ఘనంగా నిర్వహించుకోవాలని పుర ప్రజలను కోరారు.