కండక్టర్ ప్రవళిక మృతి: వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ కూనంనేని సాంబశివరావు ఆగ్రహం

రిపోర్టర్: సతీష్ స్థలం: తెలంగాణ

ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మరణానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. చిన్న ఆస్పత్రిలో చికిత్స అందించడం వల్లనే ఆమె ప్రాణాలు కోల్పోయారని ఆయన తెలిపారు. ప్రవళిక కుటుంబానికి కోటి రూపాయల ఆర్థిక పరిహారం అందించడంతో పాటు, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు. మెరుగైన వైద్యం అందించడంలో ఎలాంటి లోపాలు జరగకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.