పంతంగిలో వైభవంగా ముత్యాలమ్మ బోనాలు

రిపోర్టర్: Chinukani Yuvaraju స్థలం: చౌటుప్పల్

చౌటుప్పల్: మండలంలోని పంతంగి గ్రామంలో శ్రీ ముత్యాలమ్మ బోనాల ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ముత్యాలమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.