బీహార్ వరద బాధితులకు సహాయం అందిస్తున్న ప్రముఖ ఉపాధ్యాయుడు ఖాన్ సర్
రిపోర్టర్: గోపి
స్థలం: బీహార్
బీహార్లో వరద బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో ప్రముఖ ఉపాధ్యాయుడు, యూట్యూబర్ ఖాన్ సర్ స్వయంగా రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నారు. పడవలపై ప్రయాణిస్తూ, వాకీ-టాకీల ద్వారా అధికారులతో సమన్వయం చేసుకుంటూ బాధితులకు సహాయ సామగ్రిని పంపిణీ చేస్తున్న ఆయన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే సోషల్ మీడియాలో దీనిపై మిశ్రమ స్పందన లభిస్తోంది.