ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై మోదీ వ్యాఖ్యలతో Arvind Dharmapuri ఎద్దేవా

రిపోర్టర్: సురేష్ స్థలం: నిజామాబాద్

దేశవ్యాప్తంగా నాలుగు ప్రధాన రాష్ట్రాల్లోని ఇరవై ఎనిమిది ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సున్నా స్థానాలు సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ అరవింద్ ధర్మపురి విమర్శలు గుప్పించారు. ఈ మేరకు పదవ జన్ పథ్ సున్నా జన్ పథ్ అంటూ ఆ పార్టీ వైఫల్యాన్ని ఎద్దేవా చేస్తూ ఇంగ్లీష్ లో ఆయన ఒక ట్వీట్ పోస్ట్ చేశారు. బ్యాలెట్ పేపర్లతో నిర్వహించిన ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలిందని అందులో పేర్కొన్నారు.