లండన్ పర్యటనపై సీఎం విజయ్‌పై ప్రతిపక్షాల తీవ్ర విమర్శలు

రిపోర్టర్: రాజేష్ స్థలం: తమిళనాడు

తమిళనాడు సీఎం విజయ్ లండన్ పర్యటనపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పెట్టుబడుల పేరుతో వెళ్లిన విజయ్ కార్ రేసింగ్‌లో పాల్గొనడం, విహారయాత్ర చేయడంపై అన్నాడీఎంకే, బీజేపీ మండిపడుతున్నాయి. ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని, విజయ్ పర్యటన ల్యక్ష్యంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇది కేవలం సేద తీరడానికి వెళ్లిన వ్యక్తిగత పర్యటన మాత్రమేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.