స్వాతంత్ర్య పోరాటంలో బీజేపీకి ఏం నైతిక హక్కుంది: ఉత్తమ్ కుమార్ రెడ్డి

రిపోర్టర్: సునీల్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్లో నిర్వహించిన రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర సంస్కరణ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్ర్య పోరాటంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎలాంటి పాత్ర పోషించలేదని ఆయన దుయ్యబట్టారు. దేశం కోసం ఎలాంటి త్యాగం చేయని వారికి కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ శ్రేణులు కష్టపడి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.