స్థానిక ఎన్నికల వేళ ఆసక్తికర ఘటన: ఒకే స్థానానికి రెండు పార్టీల నుంచి నామినేషన్
రిపోర్టర్: నరేష్
స్థలం: బాడంగి
ముగడ ఎంపీటీసీ స్థానానికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అభ్యర్థి మత్స శిరీష శుక్రవారం ఉదయం తెదేపా తరఫున, సాయంత్రం జనసేన పార్టీ నుంచి నామినేషన్లు దాఖలు చేశారు. ఈ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగానే రెండు పార్టీల తరఫున నామపత్రాలు అందజేసినట్లు తెదేపా నేతలు స్పష్టం చేశారు. ఈ అనూహ్య ఘటన స్థానిక రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.