భారత్‌లో 2027 నాటికి క్యూడెంగా డెంగ్యూ వ్యాక్సిన్ అందుబాటులోకి
రిపోర్టర్: కృష్ణ
స్థలం: భారతదేశం
భారతదేశంలో డెంగ్యూ నివారణకు జపాన్‌కు చెందిన తకేడా ఫార్మాస్యూటికల్, హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సంస్థలు కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి. దేశంలోనే తొలిసారిగా ఆమోదం పొందిన క్యూడెంగా డెంగ్యూ వ్యాక్సిన్ 2027 తొలినాళ్లలో ప్రైవేట్ మార్కెట్‌లో అందుబాటులోకి రానుంది. నాలుగు నుంచి అరవై ఏళ్ల వయస్సు వారు అర్హులైన ఈ టీకాను మూడు నెలల వ్యవధిలో రెండు డోసులుగా అందించనున్నారు.