నల్లగొండలో విచిత్ర పరిస్థితి: ప్రభుత్వ కార్యాలయంలో అక్రమంగా మెకానిక్ షెడ్డు ఏర్పాటు

రిపోర్టర్: రమేష్ స్థలం: నల్లగొండ

నల్లగొండ జిల్లా కేంద్రంలోని పశుసంవర్థక శాఖ కార్యాలయ ఆవరణలో అక్రమంగా మెకానిక్ షెడ్డు వెలిసినట్లు స్థానికులు తెలిపారు. కార్యాలయానికి వచ్చే రైతులకు, అధికారులకు వాహనాల అడ్డుతో తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యాలయంలోని ఓ అధికారికి నెలకు అద్దె చెల్లిస్తూనే ఈ దందా సాగుతున్నట్లు సమాచారం అందిందని, ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే తనిఖీలు చేపట్టి అక్రమ షెడ్డును తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.