బొబ్బిలి ఏసీఎన్ అంధుల పాఠశాలలో బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రత్యేక ప్రేరణా కార్యక్రమం నిర్వహించారు

రిపోర్టర్: Bobbili GANESH స్థలం: బొబ్బిలి

విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలోని ఏసీఎన్ ఎయిడ్ బ్లైండ్ పాఠశాలలో బ్రహ్మకుమారీల సంస్థ ఆధ్వర్యంలో ప్రేరణాత్మక అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్కూల్ ప్రిన్సిపాల్ శాంతిలాల్ సమక్షంలో జరిగిన ఈ వేడుకలో 110 మంది దృష్టిలోపం ఉన్న విద్యార్థులు, 20 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సెంటర్ ఇన్చార్జి రాజేశ్వరి అక్కయ్య, మౌంట్ అబూ ప్రతినిధుల సమక్షంలో ధ్యానం, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెంపొందించేలా ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అంగవైకల్యం కంటే సామర్థ్యాలను గుర్తించాలనే లక్ష్యంతో విద్యార్థులకు ఆటపోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు.