పెద్దకొండూరు బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా శ్రీకాంత్ గౌడ్ ఎన్నిక
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
చౌటుప్పల్ మండలంలోని పెద్దకొండూరు గ్రామంలో గురువారం జరిగిన భారతీయ జనతా పార్టీ సమావేశంలో గ్రామ శాఖ నూతన అధ్యక్షుడిగా కాసుల శ్రీకాంత్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల అధ్యక్షుడు కైరంకొండ అశోక్ నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని శ్రీకాంత్ గౌడ్ స్పష్టం చేశారు.