శ్రీకాకుళం తీరానికి కొట్టుకొచ్చిన భారీ కార్గో నౌకను చూసేందుకు తరలివచ్చిన జనం

రిపోర్టర్: Dinesh Panda స్థలం: పలాస

శ్రీకాకుళం జిల్లా పలాస సమీపంలోని వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేట తీరానికి దగ్గరలో ఓ భారీ కార్గో నౌక లంగరు వేసి ఉండటాన్ని మెరైన్ పోలీసులు గుర్తించారు. తుఫాను ప్రభావం మరియు సముద్రంలో పెరిగిన అలల ఉధృతి కారణంగా నౌక ఇక్కడికి చేరి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఎన్నడూ లేనివిధంగా తీరానికి ఇంత సమీపంలో నౌక కనిపించడంతో స్థానిక ప్రజలు భారీగా తరలివచ్చి ఆసక్తిగా తిలకిస్తున్నారు.