మహిళలంటే చిన్నచూపు ఎందుకంటూ వైఎస్ జగన్‌పై షేక్ యాసిన్ ఆగ్రహం

రిపోర్టర్: కృష్ణ స్థలం: శ్రీకాకుళం

ఏపీ తరపున నేషనల్స్ ఆడి గోల్డ్ మెడల్ సాధించిన తనను ఫేక్ అంటున్నారంటూ వైఎస్ జగన్‌పై షేక్ యాసిన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలంటే చిన్నచూపు ఎందుకని ఆమె నిలదీశారు. 2022లో వరల్డ్ కప్ ఆడిన తనను ఫేక్ అంటారా అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.