విషాదం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి మాజీ చైర్మన్ చక్రపాణి కన్నుమూత
రిపోర్టర్: నరేష్
స్థలం: హైదరాబాద్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి మాజీ చైర్మన్ ఎ.చక్రపాణి హైదరాబాద్ లోని స్వగృహంలో కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. సభా వ్యవహారాల నిర్వహణలో పార్లమెంటరీ సంప్రదాయాల పరిరక్షణలో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. దాదాపు ఐదు దశాబ్దాల ప్రజా జీవితంలో అంకితభావంతో ఆయన ఎన్నో సేవలందించారని గుర్తుచేశారు. చక్రపాణి మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.