ట్రంప్ యంత్రాంగంపై న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిషియా జేమ్స్ నిప్పులు

రిపోర్టర్: వెంకట్ స్థలం: న్యూయార్క్

ట్రంప్ యంత్రాంగంపై న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిషియా జేమ్స్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హడ్సన్ వ్యాలీలో జరిగిన భారీ సభలో ఆమె మాట్లాడుతూ, వైట్ హౌస్ అనాలోచిత విధానాలను కోర్టులో అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఫెడరల్ ప్రభుత్వం అనుసరిస్తున్న అరాచక, మోసపూరిత విధానాలపై పోరాటం ఆపేది లేదని, ప్రజల హక్షాలను కాపాడేందుకు న్యాయపోరాటం కొనసాగిస్తామని ఆమె తేల్చిచెప్పారు.