ట్రాలీ కిరాయిల పెంపు: బెల్లంపల్లిలో డ్రైవర్ల బంద్ తో స్తంభించిన రవాణా

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

పెరిగిన నిత్యావసరాలు మరియు డీజిల్ ధరల నేపథ్యంలో పాత కిరాయిలతో ట్రాలీలు నడపడం కష్టంగా మారిందని బెల్లంపల్లి ట్రాలీ యూనియన్ సభ్యులు తెలిపారు. కిరాయిల పెంపును డిమాండ్ చేస్తూ బుధవారం టాటా ఏస్, మినీ ట్రాలీ డ్రైవర్లు, ఓనర్లు బంద్ పాటించి నిరసన వ్యక్తం చేశారు.