బెల్లంపల్లిలో విషాదం: పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని యువతి మృతి

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

బెల్లంపల్లిలో పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీకొనడంతో ఓ యువతి మృతి చెందింది. పట్టణంలోని కన్నాల బస్తీ మొదటి వార్డుకు చెందిన బండి అక్షయ రైలు దాటే క్రమంలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.