కొత్త చట్టాలపై పోలీసు సిబ్బందికి సీపీ అవగాహన
రిపోర్టర్: Narendra kumar kinnera
స్థలం: ఖమ్మం అర్బన్
కొత్త క్రిమినల్ చట్టాలు-2023పై ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది పూర్తి అవగాహన కలిగి ఉండాలని సీపీ సునీల్ దత్ సూచించారు. ఖమ్మం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో 500 మంది సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బందికి వారం రోజులుగా శిక్షణ ఇచ్చారు. బీఎన్ఎస్, బీఎన్ఎస్ఎస్, బీఎస్ఏ నిబంధనలు, కేసుల నమోదు, దర్యాప్తు, డిజిటల్ సాక్ష్యాలు, అరెస్టు, రిమాండ్‌పై నిపుణులు అవగాహన కల్పించారు.