హైటెక్ మోసాలు: కృత్రిమ మేధ వాయిస్‌లతో ప్రజలను దోచుకుంటున్న కేటుగాళ్లు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Hyderabad
కృత్రిమ మేధ వాయిస్ క్లోనింగ్ టెక్నాలజీతో సైబర్ నేరగాళ్లు కొత్త రకం మోసాలకు పాల్పడుతున్నారని, బంధువుల గొంతులను అనుకరించి అత్యవసరంగా డబ్బులు కోరుతున్నారని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరించారు. ప్రముఖుల గొంతులను కాపీ చేసి తప్పుడు ఆడియో క్లిప్‌లతో ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, ఎవరైనా అనుమానాస్పదంగా డబ్బులు లేదా వ్యక్తిగత వివరాలు కోరితే వెంటనే అప్రమత్తమై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని నిపుణులు సూచించారు.