నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసిన మేవా సంస్థ

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: బూర్గంపహాడ్

బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాకకు చెందిన ముస్లిం ఎంపవర్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న బాధితుడికి, విద్యుత్ అపఘాతం కారణంగా ఇల్లు ధ్వంసమైన మరో కుటుంబానికి రూ. ఐదు వేల చొప్పున సాయం అందించారు. మేవా అధ్యక్షుడు మహమ్మద్ ముస్తఫా నేతృత్వంలో ఈ సహాయం అందజేసినట్లు పేర్కొన్నారు.