రూ.200 కోట్లతో పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రులు
రిపోర్టర్: వెంకట్
స్థలం: సూర్యాపేట
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలో రూ.200 కోట్ల భారీ అంచనా వ్యయంతో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవన పనులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ మేరకు నిర్మాణ పనుల పురోగతిని, నాణ్యతా ప్రమాణాలను వారు క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు కీలక సూచనలు చేశారని, ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తో పాటు ఇతర ప్రముఖ అధికారులు పాల్గొన్నారు.