అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేక జగన్ పలాయనం: మంత్రి సత్యకుమార్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: అమరావతి
ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చించే ధైర్యం లేక జగన్ నాలుగు గోడల మధ్య మాట్లాడుతున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ మండిపడ్డారు. డీఎస్సీ నియామకాలపై మంత్రి నారా లోకేశ్ చర్చకు ఆహ్వానించినా ఎందుకు రాలేదని నిలదీశారు. తల్లిని, చెల్లిని మోసం చేసిన జగన్ రాజకీయ అసమర్థతను బయటపెట్టుకుంటున్నారని, కూటమి ఐక్యతను చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.