'కలెక్టర్ల తీరు దారుణం': బాధితుల పట్ల వ్యవహారశైలిపై BJP Telangana ఫైర్

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: Telangana

ప్రజలు సమస్యలు చెప్పుకోవడానికి కలెక్టర్ల వద్దకు వెళితే కనీస స్పందన కరువైందని BJP Telangana తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాణాపాయం నుంచి బయటపడి మీటింగుల్లో పక్కనే కూర్చున్న బాధితులను ఆదరించాల్సిన అధికారులే ఇలా వ్యవహరించడం అత్యంత దారుణమని పేర్కొంది. ఈ తీవ్రమైన పరిస్థితిపై సంబంధిత మంత్రి గారు తక్షణమే స్పందించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని BJP Telangana డిమాండ్ చేసింది.