మిస్టర్ వీటోగా మారుతానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: వాషింగ్టన్

మధ్యంతర ఎన్నికల్ లో డెమోక్రాట్లు మెజారిటీ సాధిస్తే తాను మిస్టర్ వీటోగా మారాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. వారి అధికారాలను నియంత్రించేందుకు వీటో పవర్ వినియోగిస్తానని, బిల్లులను ఆమోదించకుండా తిరస్కరిస్తానని ఆయన హెచ్చరించారు. మరోవైపు అమెరికా సైనిక స్థావరాలపై చైనా, రష్యా గూఢచర్యం చేస్తున్నాయని నిఘా అధికారులు తనకు తెలిపినట్లు ట్రంప్ వెల్లడించారు. ఇరాన్ తో శాంతి చర్చలు కొనసాగించాలని భావిస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు.