నీతీష్ కుమార్ పేరు మార్పుపై బిహార్‌లో రాజకీయ రగడ
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: బీహార్
బిహార్‌లోని బఖ్తియార్‌పుర్ పట్టణానికి నీతీష్ కుమార్ పేరు పెట్టాలన్న ప్రతిపాదనను కేంద్ర మంత్రి చిరాగ్ పాసవాన్ సమర్థించారు. అయితే, ప్రాంతాల పేర్లు మార్చడంపై సీఎం నీతీష్‌కు నమ్మకం లేదంటూ జేడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ కుమార్ ఝా ఈ డిమాండ్‌ను తోసిపుచ్చారు. మరోవైపు మద్యపాన నిషేధం, గంగా జలాల ఒప్పందంపై ఎన్‌డీఏ కూటమిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చిరాగ్ స్పష్టం చేశారు.