కేసీఆర్ ఆస్తులపై రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ భూ వివాదం

రిపోర్టర్: రాజేష్ స్థలం: హైదరాబాద్

తెలంగాణ శాసనసభ వేదికగా ప్రారంభమైన భూముల రగడ రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. కేసీఆర్ కుటుంబానికి వందలాది ఎకరాల భూమి ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించగా, 1954 నుంచే తమకు జమీందారీ ఆస్తులు ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. దీనికి విరుగుడుగా కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ 2004 లోక్సభ ఎన్నికల అఫిడవిట్ను విడుదల చేయగా, అందులో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు సున్నా ఎకరాలుగా ఉండటంతో రాజకీయం వేడెక్కింది.