పోలవరం ప్రాజెక్టుపై అంతర్జాతీయ నిపుణుల బృందం పర్యటన ముగింపు
రిపోర్టర్: సతీష్
స్థలం: Polavaram
ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించేందుకు వచ్చిన అంతర్జాతీయ నిపుణుల బృందం నాలుగు రోజుల పర్యటనను ముగించుకుందని అధికారులు తెలిపారు. పీపీఏ సీఈఓ సంజీవ్ వోహ్రా అధ్యక్షతన సాగిన ఈ పర్యటనలో ఈసీఆర్ఎఫ్ డ్యామ్తో పాటు కీలక నిర్మాణ పనులను నిపుణులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల వేగాన్ని మరింత పెంచాలని, నాణ్యతలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు.