బెంగళూరు ఆసుపత్రిలో రాప్తాడు బాధితురాలు గోపికను పరామర్శించిన వైఎస్ జగన్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Bengaluru
రాప్తాడులో దాడికి గురై తీవ్రంగా గాయపడి బెంగళూరు మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని గోపికను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఈ మేరకు తాడేపల్లి నుంచి బెంగళూరు వెళ్లిన ఆయన, ఆసుపత్రిలో చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితురాలి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించి, మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఈ ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.