'సాగర్ కాలువలో హరిప్రసాద్ మృతదేహం లభ్యం': కొణిజర్లలో విషాదం

రిపోర్టర్: మహేష్ స్థలం: ఖమ్మం

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అమ్మపాలెం గ్రామానికి చెందిన హరిప్రసాద్ సాగర్ కాలువలో గల్లంతు కాగా, గురువారం ఉదయం తనికెళ్ల సమీపంలోని బోనకల్ బ్రాంచ్ కెనాల్ లాకుల వద్ద ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆయన మృతదేహాన్ని గుర్తించాయి. క్షణికావేశంలో భార్యాభర్తలు కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఈ ఘటనలో పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.