వైద్యుడికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో బెదిరింపులు: రోగినే నిందితుడిగా అరెస్ట్
రిపోర్టర్: సతీష్
స్థలం: New Delhi
ఢిల్లీలోని పశ్చిమ్ విహార్ ప్రాంతంలో ఓ వైద్యుడిని గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరుతో బెదిరించి ఇరవై ఐదు లక్షలు డిమాండ్ చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారని డీసీపీ విక్రమ్ సింగ్ తెలిపారు. గత మూడేళ్లుగా ఆ వైద్యుడి వద్దే చికిత్స పొందుతున్న హిమాన్షు జైన్ అనే రోగీయే ఈ నేరానికి పాల్పడినట్లు పోలీసులు విచారణలో గుర్తించి కటకటాల్లోకి నెట్టారు.