విమాన ఛార్జీల పెంపు పిటిషన్: ప్రయాణించకండంటూ సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

రిపోర్టర్: రాజేష్ స్థలం: New Delhi

దీపావళి పండుగ వేళ విమాన సర్వీసుల ఛార్జీలు ఏకంగా ఏడు వందల శాతం పెరగడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ మేరకు విమానంలో ప్రయాణించకండి అంటూ జస్టిస్ విక్రమ్ నాథ్ తేల్చిచెప్పినట్లు పిటిషనర్ తరఫు న్యాయవాది అభినవ్ తెలిపారు. నిత్యావసర సేవల కింద ధరలను నియంత్రించాలని కోరినప్పటికీ న్యాయమూర్తి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.