మణిపూర్లో దారుణం: తల లేని మృతదేహంతో కుటుంబ సభ్యుల ఆందోళన

రిపోర్టర్: సునీల్ స్థలం: Imphal

మణిపూర్లోని కాంగ్పోక్పి జిల్లాలో సాయుధుల దాడిలో మృతి చెందిన అజిన్బౌ ఆర్ తల కనిపించకుండా పోవడం తీవ్ర కలకలం రేపింది. తలను తిరిగి అప్పగించే వరకు పోస్టుమార్టం నిర్వహించడానికి వీల్లేదని జాయింట్ ట్రైబ్స్ కౌన్సిల్ స్పష్టం చేసింది. ఈ ఘటనపై నగా సివిల్ సొసైటీ సంస్థ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నలభై ఎనిమిది గంటల డెడ్లైన్ విధించినట్లు కౌన్సిల్ ప్రతినిధులు వెల్లడించారు. వెంటనే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.