ప్రజా పాలన వేడుకలకు ముమ్మరంగా సాగుతున్న ఏర్పాట్లు
రిపోర్టర్: SK
స్థలం: పెద్దపల్లి
సెప్టెంబర్ 17న నిర్వహించనున్న తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వేదిక, సీటింగ్, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, ట్రాఫిక్, బందోబస్తు తదితర ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఈ వేడుకలను విజయవంతం చేయాలని ఆయన స్పష్టం చేశారు.