నిడదవోలులో ముంపు ప్రాంతాలను వర్షంలోనే పరిశీలించిన మంత్రి కందుల దుర్గేష్
రిపోర్టర్: సురేష్
స్థలం: నిడదవోలు
భారీ వర్షాల నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలోని ముంపు ప్రాంతాల్లో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు స్వయంగా పర్యటించారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఆయన పరిశీలించారు. స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ, అధికారులకు తక్షణ సహాయక చర్యలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వర్షాల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను పర్యాటక శాఖ మంత్రి హెచ్చరించారు.