రైతన్నలకు తీపి కబురు: ఫ్రీహోల్డ్ భూముల దరఖాస్తులపై ప్రభుత్వ కీలక జీవో

రిపోర్టర్: హరి స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసైన్డ్, చుక్కల భూముల ఫ్రీహోల్డ్ దరఖాస్తుల పరిష్కారానికి అరెస్టు చేసిన జీవోలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. తహసీల్దార్ నుంచి ఆర్డీవో స్థాయి వరకు గరిష్టంగా అరవై రోజుల వ్యవధిలోనే దరఖాస్తులను పరిష్కరించాలని ఆదేశించారు. నిషేధిత జాబితా నుంచి ఈ భూములను తొలగించి వెబ్ ల్యాండ్ లో తక్షణమే అప్ డేట్ చేయాలని స్పష్టం చేశారు. ఈ చారిత్రాత్మక నిర్ణయంతో రైతులకు పూర్తిస్థాయి యాజమాన్య హక్కులు లభించనున్నాయి.