ఢిల్లీ విశ్వవిద్యాలయ హాస్టళ్ల ఏర్పాటుపై హైకోర్టు కీలక నోటీసులు జారీ
రిపోర్టర్: శివ
స్థలం: న్యూఢిల్లీ
ఢిల్లీ విశ్వవిద్యాలయ పరిధిలోని అన్ని కాలేజీలలో హాస్టల్ సౌకర్యాలు కల్పించాలని కోరుతూ దాఖలైన పిల్ పై ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సత్య నికేతన్ లో పీజీ భవనం కూలి ఏడుగురు మృతి చెందిన ఘటన నేపథ్యంలో విద్యార్థుల వసతి, భద్రత అంశంపై న్యాయస్థానం సీరియస్ అయింది. ప్రైవేట్ పీజీలపై విద్యార్థుల ఆధారపడటాన్ని తగ్గించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని పిటిషన్ లో కోరారు.