బెల్లంపల్లి వార్డుల్లో ఘనంగా జరిగిన బతుకమ్మ సంబరాలు

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

బెల్లంపల్లి పట్టణంలోని పలు వార్డుల్లో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళలు మరియు స్థానికులతో కలిసి వేడుకల్లో మమేకమై పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ తెలంగాణ సంస్కృతికి, ఆత్మీయతకు ప్రతీకని ఆయన పేర్కొన్నారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అలాగే ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి సందడి చేశారు.