గుండె ఆరోగ్యానికి సరైన నిద్ర ఎంత ముఖ్యం అని ప్రముఖ కార్డియాలజిస్ట్ వెల్లడి

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: తెలంగాణ

ఆరోగ్యకరమైన జీవనశైలికి ప్రశాంతమైన నిద్ర ఎంతో అవసరమని ప్రముఖ కార్డియాలజిస్ట్ ఎం.ఎస్.ఎస్. ముఖర్జీ వెల్లడించారు. రాత్రి పూట సరిగ్గా నిద్రపోకపోతే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ రోజుకు ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్రపోవాలని తెలిపారు. రాత్రి పది నుంచి పదకొండు గంటల మధ్య నిద్రకు ఉపక్రమించడం గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆయన స్పష్టం చేశారు.