జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం: బలవన్మరణానికి పాల్పడిన కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు

రిపోర్టర్: రమేష్ స్థలం: జోగులాంబ గద్వాల

జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గద్వాలలోని TGSP 10వ బెటాలియన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆయన ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. కుటుంబ కలహాల కారణంగానే వెంకటేశ్వర్లు తీవ్ర మనస్తాపానికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని వారు వెల్లడించారు.