తెలుగు రాష్ట్రాల భాజపా ప్రధాన కార్యదర్శిగా మధుకర్ నియామకం
రిపోర్టర్: సునీల్
స్థలం: హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మధుకర్ నియమితులయ్యారని పార్టీ జాతీయ కార్యాలయం వెల్లడించింది. హైదరాబాద్ కేంద్రంగా ఈయన ఇరు రాష్ట్రాల సంస్థాగత బాధ్యతలను పర్యవేక్షిస్తారని పేర్కొంది. సంస్థాగత నిర్మాణం మరింత పటిష్ఠం చేసే క్రమంలో జాతీయ స్థాయిలో పలు నియామకాలను భాజపా చేపట్టిందని తెలిపింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆమోదంతో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, విభాగాలకు చెందిన ఇరవై నాలుగు మందికి వివిధ సంస్థాగత బాధ్యతలు అప్పగిస్తూ గురువారం దిల్లీలో ప్రకటన విడుదల చేశారు.