అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ శ్రేణుల నిరసన, హరీష్ రావు అరెస్ట్

రిపోర్టర్: రాము స్థలం: హైదరాబాద్

అసెంబ్లీ సమావేశాల వేళ హైదరాబాద్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ నల్ల టీషర్టులతో వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ తోపులాటలో హరీష్ రావు బనియన్‌తో నిరసన తెలపగా, కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి తదితరులను పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళా నేతల పట్ల పోలీసులు దుర్మార్గంగా ప్రవర్తించారని, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని బీఆర్ఎస్ హెచ్చరించింది.