టెక్సాస్ వర్సిటీ ఫుట్బాల్ సంబరాలపై వివాదం: భారతీయ విద్యార్థులపై రిపబ్లికన్ నేత విమర్శలు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Texas
అమెరికాలోని టెక్సాస్ విశ్వవిద్యాలయ విద్యార్థుల ఫుట్బాల్ విజయ సంబరాలపై రిపబ్లికన్ నేత బో ఫ్రెంచ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయని సీనియర్ జర్నలిస్టులు పేర్కొన్నారు. సంబరాల్ లో పాల్గొన్న భారతీయ సంతతి విద్యార్థి ధైర్య గుప్తాతో పాటు ఇతరులపై ఆయన చేసిన విమర్శలు అమెరికా రాజకీయాల్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలను రిపబ్లికన్ సెనేటర్ జాన్ కార్నిన్ తో పాటు పలువురు నేతలు ఖండించగా, క్షమాపణ చెప్పేందుకు ఫ్రెంచ్ నిరాకరించారని విశ్లేషకులు తెలిపారు.