బ్రిక్స్ థీమ్తో మేడ్చల్లో వైభవంగా గణేష్ నిమజ్జనోత్సవాలు

రిపోర్టర్: నరేష్ స్థలం: మేడ్చల్

మేడ్చల్ పట్టణంలో గణేష్ నిమజ్జనోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. స్థానిక చైతన్య యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం మరియు నిమజ్జన రథం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దేశ ప్రతిష్టను ప్రతిబింబించేలా ఈసారి బ్రిక్స్ ఇండియా ప్రధాన ఇతివృత్తంతో ఈ శోభాయాత్రను రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. జాతీయ జెండాలు, బ్రిక్స్ లోగో, పద్మం ఆకృతి, చత్రపతి శివాజీ మహారాజ్, లోకమాన్య తిలక్ చిత్రపటాలతో వేదికను అద్భుతంగా తీర్చిదిద్దారు. భక్తిశ్రద్ధలతో భక్తులు గణనాథునికి వీడ్కోలు పలికారు.