భక్తిశ్రద్ధలతో వినాయక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్

రిపోర్టర్: k. siva prasad స్థలం: చిట్వేల్

తిరుపతి జిల్లా చిట్వేల్ పట్టణంలోని సత్తెమ్మ వీధిలో ఏర్పాటు చేసిన శ్రీ వినాయకమయ్య స్వామివారి ప్రతిమను స్థానిక ఎమ్మెల్యే అరవ శ్రీధర్, యువనేత ముక్కా సాయి వికాస్ రెడ్డి, రాజుకుంట నరసింహ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ నిర్వాహకులు వారికి ఘనస్వాగతం పలికారు. నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, స్థానికులు, కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.