ఆందోళనకరం: దేశంలో నమిలే పొగాకు వినియోగంపై ది లాన్సెట్ నివేదిక
రిపోర్టర్: నరేష్
స్థలం: న్యూఢిల్లీ
దేశంలో జర్దా, ఖైనీ వంటి నమిలే పొగాకు ఉత్పత్తులను ఉపయోగిస్తున్న వారి సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరుగుతోందని ది లాన్సెట్ వైద్య పరిశోధనా పత్రిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా నమిలే పొగాకును ఎక్కువగా వినియోగిస్తున్న దేశాల జాబితాలో భారతదేశం మొదటి వరుసలో నిలవడం తీవ్రమైన ఆరోగ్య సంక్షోభానికి అద్దం పడుతోందని నివేదిక పేర్కొంది.