నెల్లూరులో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు: పట్టణ ప్రణాళిక అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: నెల్లూరు

నగరంలో అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయని, టౌన్ ప్లానింగ్ అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో పాటు ఎల్టీపీల అండదండలతో అక్రమాలు పెరిగిపోతున్నాయని నెల్లూరు నగరపాలక సంస్థ అధికారులు తెలిపారు. ఆన్లైన్ అనుమతుల పేరుతో కొందరు సిబ్బంది అమాయకులను మోసగిస్తూ భవన నిర్మాణ స్థాయిని బట్టి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారని, అనధికార కట్టడాలను గుర్తించి త్వరలోనే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ నందన్ స్పష్టం చేశారు.